Sun Dec 22 2024 20:19:33 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త మలుపులు తిరుగుతున్న వెంకాయమ్మ వివాదం
ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన వెంకాయమ్మ వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది.
ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన వెంకాయమ్మ వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వంపై వెంకాయమ్మ దుమ్మెత్తి పోసిన వీడియో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది. తనపైన వైసీపీ నేతలు దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వెంకాయమ్మ నిన్న టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అయితే, వైసీపీ నాయకులు ఈ వివాదానికి సంబంధించి కొన్ని ఆధారాలను తెర మీదకు తెచ్చారు. వీడియోలో తనకు పింఛన్ రావడం లేదని వెంకాయమ్మ ఆరోపించింది. కానీ, వెంకాయమ్మకు ఒంటరి మహిళ కోటాలో పింఛన్ వేస్తోందని, ఈ నెల కూడా 1వ తేదీనే ఉదయం 5.49 గంటలకు ఆమె పింఛన్ తీసుకుందని వైసీపీ నేతలు ఆధారాలు చూపించారు.
అంతేకాదు, తనకు కరెంటు బిల్లు రూ.18 వేలు వచ్చిందని వెంకాయమ్మ ఆరోపించారు. అయితే, ఆమె ఎస్సీ కోటా కింద సబ్సిడీ పొందుతున్నారని, ఆరు నెలలుగా అసలు కరెంటు బిల్లు కట్టలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. తాను పక్కా టీడీపీ అని చెప్పారు. దీంతో టీడీపీ కార్యకర్తతో ఆ పార్టీ డ్రామాలు ఆడిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి, ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Next Story