Fri Dec 20 2024 13:58:22 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రేపే తీర్పు.. ఎలా ఉంటుందోనన్న టెన్షన్ అందరిలోనూ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్ పై రేపు తీర్పు రానుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్ పై రేపు తీర్పు రానుంది. సుప్రీంకోర్టులో ఈ తీర్పు వెలువడనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు జస్టిన్ అనిరుధ్, బేలా త్రేవేది ధర్మాసనం దీనిపై తీర్పు చెప్పనుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో టెన్షన్ మొదలయింది. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో సీఐడీ అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని 17 ఎ కింద గవర్నర్ నుంచి అనుమతి తీసుకోలేదని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
గవర్నర్ అనుమతి లేకుండానే...
గవర్నర్ అనుమతి లేకుండానే తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన వేసిన పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు రేపు వెలువడనుంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన తాను క్లీన్ చిట్ తో బయటపడాలని కోరుకుంటూ ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టులో వేశారు. దీనిపై తీర్పు వెలువడేంత వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబును సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Next Story