Thu Dec 26 2024 14:45:10 GMT+0000 (Coordinated Universal Time)
ఇలా అయితే ఎలా?
రాజకీయనాయకులు యువతకు ఆదర్శంగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు
రాజకీయనాయకులు యువతకు ఆదర్శంగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నేటి రాజకీయనేతల తీరు సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లాలోని పాటిబండ్ల సీతారామయ్య వజ్రోత్సవ వేడుకల్లో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో రోజురోజుకూ విలువలు తగ్గుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సభ్యుల తీరుపై.....
పార్లమెంటులోనూ సభ్యుల తీరు సరిగా లేదన్నారు. కుర్చీలు ఎక్కడం, కుర్చీలు విసురుకోవడం, మైకులు పగలకొట్టడం ఏంటని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. నవతరానికి ఆదర్శంగా నిలవాల్సిన కొందరు రాజకీయ నేతలు అవినీతి కేసుల్లో చిక్కుకుంటున్నారని ఆవేదన చెందారు. పార్లమెంటు సమయాన్ని వృధా చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇలాంటి నేతలు నవతరానికి ఆదర్శంగా ఎలా నిలుస్తారని ప్రశ్నించారు.
Next Story