Mon Apr 14 2025 15:16:42 GMT+0000 (Coordinated Universal Time)
విజయమ్మ రాజీనామాపై విజయసాయి...?
రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు సభ్యత్వం ఒకరికి ఉండకూడదని విజయమ్మ స్వచ్ఛందంగా రాజీనామా చేశారని విజయసాయిరె్డి అన్నారు

వైసీపీ ప్లీనరీ విజయవంతమయిందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ప్లీనరీకి 9 మంది లక్షల మంది హాజరయ్యారన్నారు. వైఎస్ విజయమ్మ రాజీనామాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయన వైసీపీ ప్లీనరీ జరిగిన తీరుపై మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందన్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు సభ్యత్వం ఒకరికి ఉండకూడదని విజయమ్మ స్వచ్ఛందంగా రాజీనామా చేశారన్నారు. విజయమ్మ పట్ల గౌరవం చెక్కుచెదరదని చెప్పారు. షర్మిలకు అండగా ఉండేందుకే ఆమె రాజీనామా చేశారన్నారు. సైకో చంద్రబాబు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. ఫ్రస్టేషన్ లో చంద్రబాబు శాడిస్ట్ లా వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
అతి పెద్ద స్కాం....
ప్రపంచలోనే అతి పెద్ద స్కాం అమరావతి అని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఫ్రస్టేషన్ లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. వైసీపీ ప్లీనరీ జరగకూడదని చంద్రబాబు అన్ని మొక్కులు మొక్కుకున్నారన్నారు. కానీ విజయవంతం కావడంతో సహించలేక ఆయన, ఎల్లో మీడియా కలసి దుష్ప్రచారం చేస్తుందన్నారు. వైసీపీ ప్లీనరీకి మరణించిన వేమూరు కార్యకర్త కుటుంబానికి పార్టీ తరుపున ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు.
Next Story