Mon Dec 15 2025 00:21:39 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో సిటీ సివిల్ కోర్టు భవనాల ప్రారంభం
విజయవాడ సిటీ సివిల్ కోర్డులను జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు

విజయవాడ సిటీ సివిల్ కోర్డులను జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. భవన నిర్మాణ బాధ్యతలను తీసుకోవడానికి కేంద్రం నుంచి వ్యతిరేకత వచ్చిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మద్దతుగా నిలిచారన్నారు. ప్రజలకు సత్వరం న్యాయం జరిగేలా చూడాలని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. బార్ అసోసియేషన్ కష్టాలు తనకు తెలుసునని తెలిపారు. 1983లో ఇక్కడే ప్రాక్టీస్ మొదలు పెట్టానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కోర్టు కాంప్లెక్స్ ను సక్రమంగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
ఐకమత్యంతో ఉంటేనే....
సమాజం శాంతియుతంగా ఐకమత్యంతో ఉంటే అభివృద్ధి చెందుతుందన్నారు. విభజన తర్వాత ఏపీ అన్ని రంగాల్లో వెనకబడి ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని, అందరూ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. తాను చీఫ్ జస్టిస్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యాయమూర్తులను నియమించారు. 58 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభమయిన ఈ భవనం వంద కోట్లకు మించిపోయిందని, అయినా ముఖ్యమంత్రి సహకరించారని అన్నారు. విశాఖపట్నంలోనూ న్యాయస్థానం నిర్మాణంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. భవన నిర్మాణ కోసం కష్టపడిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఈ కోర్టు సముదాయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషకరమని అన్నారు.
Next Story

