Mon Dec 23 2024 15:03:50 GMT+0000 (Coordinated Universal Time)
మూలా నక్షత్రం - సరస్వతీదేవి అలంకారం
విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వారిని అదుపు చేయడం కూడా పోలీసులకు కష్టంగా మారింది. ఈరోజు మూలా నక్షత్రం కావడంతో ఎక్కువ మంది వస్తారని ముందుగా అనుకున్నప్పటికీ అంచనాకు మించి భక్తులు హాజరు కావడంతో పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
నాలుగు లక్షల మంది....
వినాయక టెంపుల్ నుంచి ఘాట్ రోడ్డు వరకూ భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా వారికి మంచినీరు అందించే ప్రక్రియను చేపట్టారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భావించిన భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. ఈరోజు దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈరోజు ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Next Story