Wed Apr 02 2025 17:46:28 GMT+0000 (Coordinated Universal Time)
TDP : టీడీపీలో చేరిన బెజవాడ నేతలు
విజయవాడ నేతలు టీడీపీలో చేరారు. నారా లోకేష్ సమక్షంలో వారు పార్టీలో చేరారు.

విజయవాడ నేతలు టీడీపీలో చేరారు. నారా లోకేష్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. జగన్ అరాచక పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కలసిరావాలన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పిలుపుతో వివిధవర్గాల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోందని అన్నారు. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖులు చెన్నుపాటి శ్రీనివాస్, పరమేష్ లు టీడీపీ ఎంపి అభ్యర్థి కేశినేని చిన్ని నేతృత్వంలో ఆదివారం మధ్యాహ్నం టీడీపీలో చేరారు.
ఉండవల్లి నివాసంలో...
ఉండవల్లి నివాసంలో వారిద్దరికీ యువనేత లోకేష్ పసుపు కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కలసివచ్చే నాయకులందరికీ టీడీపీ ద్వారాలు తెరిచే ఉంటాయని నారా లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ నగరంలో పార్టీ విజయం కోసం పనిచేయాలని, ఎన్నికల తర్వాత కష్టపడిన నేతలకు తగిన గుర్తింపునిస్తామని చెప్పారు.
Next Story