Mon Dec 23 2024 08:47:43 GMT+0000 (Coordinated Universal Time)
టిక్కెట్ వాళ్లకిస్తే నా మద్దతుండదు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని చిన్నికి తాను మద్దతిచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. చచ్చినా తన సోదరుడు కేశినేని చిన్నికి సపోర్టు చేయను అని చెప్పారు. అంతేకాదు కేశినేని చిన్ని లాంటి వాళ్లకు తాను అండగా నిలబడనని చెప్పారు. టిక్కెట్ ఇచ్చే విషయంలో అధినాయకత్వానిదే నిర్ణయమన్న కేశినేని నాని అది గాంధీకి ఇవ్వొచ్చు, నెట్టెం రఘురాంకు ఇవ్వొచ్చని, ఎవరికైనా మాఫియా డాన్ కు కూడా ఇచ్చే అవకాశముందని, అప్పటి పరిస్థితులను బట్టి ఎవరికైనా ఇచ్చే అవకాశముందని తెలిపారు.
చిన్నికి ఇస్తే చెయ్యను...
అందులో నీతిపరులుంటారని, అవినీతి పరులుంటారని కానీ, తాను రాజకీయాల్లోకి వచ్చింది నీతిగా రాజకీయాలు చేయాలని మాత్రమేనని చెప్పారు. అంతేతప్ప అవినీతిపరులను తన వెనుకుసి, నా కాంపౌండ్ చుట్టూ పెట్టుకోని కేశినేని నాని స్పష్టం చేశారు. అలాంటి వారిని తాను దూరంగా ఉంచుతానని తెలిపారు. ఒక పేదవాడిని ఎంపీని చేయమంటే నెత్తినపెట్టుకుని మరీ సపోర్టు చేస్తాను తప్పించి, కేశినేని చిన్నికి మాత్రం సపోర్టు చేయనని స్పష్టం చేశారు. భూకబ్జాదారులను, సెక్స్ ర్యాకెట్ నడిపేవాళ్లను, పేకాట క్లబ్ లను ఆడించేవాళ్లకు తన మద్దతు ఉండదని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.
Next Story