Mon Dec 15 2025 03:59:27 GMT+0000 (Coordinated Universal Time)
కేశినాని నాని కామెంట్స్... వైరల్
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సభ్యుడిగా వైసీపీ ఎమ్మెల్యే సభకు కూడా వెళతానని అన్నారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడు కాబట్టే తాను ఎంపీ నిధులను కేటాయించానని ఆయన తెలిపారు. జగన్ ను ఎదుర్కొనాలంటే అందరూ కలసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. తాను ఎంపీనని, తనకు కొమ్ములున్నాయనుకుంటే కుదరదని, ప్రజలు ఇంటికి పంపుతారని ఆయన అన్నారు. ఇది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్యమని గుర్తు చేశారు.
సామంతరాజు అనుకుంటే...
రాజకీయాల్లో నువ్వు లవ్ చేయి.. నేను లవ్ చేయను అంటే కుదరదని కేశినేని నాని అన్నారు. యూలవ్ మీ.. ఐలవ్ యూ అనేలా వ్యవహరించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే వాళ్లకే టిక్కెట్లు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నేనే ఎమ్మెల్యే అవ్వాలి, నేనే మంత్రి అవ్వాలనుకుంటే అన్ని సార్లు కుదరదని అన్నారు. తాను సామంతరాజు అని ఫీలయితే ప్రజాసేవ చేయలేమని పరోక్షంగా కేశినేని నాని పార్టీలోని తన ప్రత్యర్థులకు హితవు పలికారు.
Next Story

