Mon Dec 23 2024 07:36:40 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు బొకే ఇవ్వకుండా కేశినేని ఏం చేశారంటే?
ఢిల్లీలో చంద్రబాబు పర్యటనలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ముభావంగా ఉన్నారు.
ఢిల్లీలో చంద్రబాబు పర్యటనలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ముభావంగా ఉన్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి టీడీపీకి చెందిన ఎంపీలు వచ్చారు. అందులో కేశినేని నాని కూడా ఉన్నారు. అయితే చంద్రబాబుకు బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ కేశినేని నానికి కోరి బొకే ఇవ్వబోయారు. అయితే మీరే ఇవ్వడంటూ పుష్ప గుచ్ఛాన్ని కేశినేని నాని విసురుగా తోసేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ ఎంపీలు విస్తుబోయారు. చంద్రబాబు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం గల్లా జయదేవ్ చంద్రబాబుకు విమానాశ్రయంలో శాలువా కప్పి, బొకే ఇచ్చారు.
ముభావంగా ....
కేశినేని నాని చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు వెంట నడుస్తున్నా ఆయన ముభావంగా ఉండటం కన్పించింది. ఇటీవల కొంతకాలంగా కేశినేని నాని చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవదని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వచ్చిన చంద్రబాబుతో మాట్లాడేందుకు కూడా కేశినేని నాని ఇష్టపడలేదు. మరి ఆయన ఎందుకు విమానాశ్రయానికి వచ్చారంటూ టీడీపీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి.
Next Story