Mon Dec 23 2024 14:50:20 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడ చేరుకునే అన్ని మార్గాలూ
విజయవాడ పోలీసుల నిఘా నీడలో కొనసాగుతుంది. నేడు ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని పోలీసులు నిర్ణయించారు.
విజయవాడ పోలీసుల నిఘా నీడలో కొనసాగుతుంది. నేడు ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా బెజవాడలో పోలీసులు కన్పిస్తున్నారు. బెజవాడకు వచ్చే నాలుగు రహదారులపై చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోనే నేతలు, ఉద్యోగులు విజయవాడకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు బస్సులు, రైళ్లను ఆశ్రయించి వస్తున్నారన్న సమాచారంతో వాటిలో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విజయవాడకు చేరుకునే రెండు జాతీయ రహదారులు, ముఖ్యమైన మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
అన్ని రకాలుగా....
ఇక రెండు రోజుల పాటు సెలవులు ఇవ్వవద్దని ఉన్నతాధికారులకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు అందాయి. ఉపాధ్యాయులు ఎవరూ పాల్గొన కుండా పాఠశాళలకు వెళ్లి మరీ హెడ్ మాస్టర్ లకు పోలీసు అధికారులు వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చారు. ఇక ప్రయివేటు వాహనాలు అద్దెకు ఇవ్వకుండా కట్టడి చేశారు. ఉద్యోగులు విజయవాడకు చేరుకునే అన్ని మార్గాలను పోలీసులు దిగ్భంధనం చేశారు. మరి చలో విజయవాడ కార్యక్రమం ఏ మేురకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి.
Next Story