Vangaveeti Radha : బలమైన సిగ్నల్స్ వచ్చినట్లుందిగా.. రెండు దశాబ్దాల తర్వాత వంగవీటి
విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకు రెండు మూడు రోజుల్లో గుడ్ న్యూస్ అందనుంది.

విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకు రెండు మూడు రోజుల్లో గుడ్ న్యూస్ అందనుంది. ఆయనకు ఎమ్మెల్సీగా చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో బెజవాడ నేతగా ఆయన పేరును టీడీపీ అధినాయకత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు వంద శాతం ఉన్నాయి. ఇప్పటికే వంగవీటి రాధాకు ఈ మేరకు సిగ్నల్స్ కూడా అందినట్లు తెలిసింది. గత ఎన్నిల్లో టిక్కెట్ దక్కకపోయినా కూటమి పార్టీ లకోసం పనిచేయడాన్ని వంగవీటి రాధాకు ప్లస్ పాయింట్ గా మారింది. పార్టీని నమ్ముకుని ఉండటం, ఓటమిపాలయినా పార్టీని అంటిపెట్టుకుని ఉండటంతో చంద్రబాబు వంగవీటి రాధాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చినా కాపు, కమ్మ సామాజికవర్గాలకు ఒకే స్థానంతో ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు.