Sat Dec 21 2024 08:08:01 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Nani : అందుకే నేను టీడీపీకి గుడ్ బై చెప్పా
చంద్రబాబు ఒక యూటర్న్ మాస్టర్ అని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు.
చంద్రబాబు ఒక యూటర్న్ మాస్టర్ అని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. పక్కా వ్యాపారి చంద్రబాబు అని అన్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని చంద్రబాబు పై కేశినేని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు, సుజనా చౌదరి ఇద్దరికీ రాజకీయం అంటే వ్యాపారమేనని ఆయన అన్నారు.
యూటర్న్ మాస్టర్...
తాను చంద్రబాబు విధానాలు నచ్చకే పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమని, తిరిగి హైదరాబాద్ కు వెళ్లడం కూడా అంతే ఖాయమని కేశినేని నాని అన్నారు. వైసీపీ వల్లనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
Next Story