Mon Dec 23 2024 08:49:14 GMT+0000 (Coordinated Universal Time)
లిస్టు పంపుతానంటున్న కేశినేని నాని
విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని సెటైర్ వేశారు
విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని సెటైర్ వేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారి జాబితాను పంపుతానని, రుజువులతో సహా పంపుతానని, చర్యలు తీసుకుంటారా? అని కేశినేని నాని ప్రశ్నించారు.
నెట్టెం హెచ్చరికలపై...
నెట్టెం రఘురాం ఇటీవల పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ అంతర్గత చర్చలు, సమావేశాల్లో సంభాషణలను వక్రీకరించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది తనను ఉద్దేశించి చేసినవే అని భావించిన కేశినేని నాని ఈ మేరకు నెట్టెం రఘురాంకు సెటైర్ రూపంలో సవాల్ విసిరారు.
Next Story