Wed Dec 25 2024 04:16:33 GMT+0000 (Coordinated Universal Time)
జీవో విడుదల చేసిన సర్కార్
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వార్డు సచివాలయ ఉద్యోగులు నేటి నుంచి శాశ్వత ఉద్యోగులయ్యారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాసయిన వారందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండేళ్లు పూర్తి చేసుకున్న....
జీవో ఎంఎస్ నెంబరు 5 ద్వారా కొద్దిసేపటి క్రితం ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగలందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలను చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసింది.
Next Story