Sun Dec 22 2024 16:07:49 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఎన్నికల అనంతరం హింస.. తాడిపత్రిలో దాడులకు దిగుతున్న ఇరు వర్గాలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిలక అనంతరం హింస కొనసాగుతుంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య అనేక ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిలక అనంతరం హింస కొనసాగుతుంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య అనేక ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఈ హింస చెలరేగుతుంది. తాడపత్రిలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణకు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు. ఒకరిపై ఒకరు రాళ్లదాడికి దిగడంతో మురళీకృష్ణకు తీవ్రగాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరులోనూ...
అలాగే చిత్తూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. ఈ దాడిలో నాని ఛాతికి తీవ్రగాయాలు కావడంతో ఆయనను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగానే మారింది. వైసీపీ నేతల వాహనాలను టీడీపీ క్యాడర్ ధ్వంసం చేసింది. మాచర్లలోని కారంపూడిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. చెక్ పోస్టు సెంటర్ వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాళ్లదాడి జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొడుతున్నారు.
Next Story