Mon Dec 23 2024 09:39:39 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ కార్పొరేటర్లకు తప్పిన ప్రమాదం
స్టడీ టూర్ కు వెళ్లిన విశాఖ కార్పొరేటర్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు
స్టడీ టూర్ కు వెళ్లిన విశాఖ కార్పొరేటర్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కులుమనాలని నుంచి చండీఘడ్ వెళుతుండగా కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ మధ్యలోనే చిక్కుకుని పోయారు. విశాఖపట్నం కార్పొరేషన్ కు చెంని 95 మంది కార్పొరేటర్లు వారి కుటుంబ సభ్యులు కలసి కులుమనాలి స్టడీ టూర్ కు వెళ్లారు. ఢిల్లీ, హిమాచల్ప్రదేశ్, సిమ్లా లలో పర్యటించారు. నిన్న కులు మునిసిపాలిటీలోనే పలు ప్రాంతాలను సందర్శించారు.
ఘాట్ రోడ్డులో చిక్కుకుని...
అయితే కులుమనాలి నుంచి చండీఘడ్ వెళుతుండగా ఘాట్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కార్పొరేటర్లు రాత్రి నుంచి రోడ్డు పైనే ఉన్నారు. వర్షం పడుతుండటంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. రోడ్డు క్లియర్ చేసేందుకు కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు. ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి రాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత సమయం పట్టే అవకాశముందని తెలిసింది. దీంతో రోడ్డు, బస్సులోనే కార్పొరేటర్లు కాలం గడుపుతున్నారు.
Next Story