Thu Dec 19 2024 06:59:24 GMT+0000 (Coordinated Universal Time)
Visakha : విశాఖకు తరలిపోనున్న శాఖలు... కీలక ఉత్తర్వుల విడుదల
విశాఖలో పరిపాలన రాజధానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు మిలీనియం టవర్స్ లో ఏబీ టవర్స్ ను శాఖకు కేటాయించింది.
విశాఖలో పరిపాలన రాజధానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు మిలీనియం టవర్స్ లో ఏబీ టవర్స్ ను శాఖకు కేటాయించింది. సొంత భవనాలు లేని శాఖలకు మాత్రమే మిలీనియం టవర్స్ లో స్థలం కేటాయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సొంత కార్యాలయాలున్న శాఖలు మాత్రం ఆ కార్యాలయాల్లోనే తమ పాలనను కొనసాగించేలా చూడాలని జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో విశాఖ కు పరిపాలన తరలి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.
డిసెంబరు నెల నుంచి...
డిసెంబరు నెల నుంచి తాను పరిపాలనను విశాఖలో ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యంలో మిలీనియం టవర్స్ లో ముఖ్యమైన శాఖలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కూడా వేగంగా నిర్మాణం జరుగుతుంది. పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. డిసెంబరు నెల నుంచి జగన్ విశాఖ నుంచే పాలన సాగిస్తామని చెప్పడంతో ఇక ఆలస్యం చేయకుండా వివిధ శాఖల అధికారులను కూడా విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
Next Story