Thu Dec 19 2024 08:41:16 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టులో లింగమనేని పిటీషన్ తిరసకరణ
విశాఖ రిషికొండ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లింగమనేని పిటీషన్ ను తిరస్కరించింది
విశాఖ రిషికొండ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లింగమనేని పిటీషన్ ను తిరస్కరించింది. రాజకీయాలకు ఇది వేదిక కాదని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు, ఎన్జీటీ వద్ద పెండింగ్ లో పిటీషన్లు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విశాఖ రిషికొండపై ఈరోజు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తో కూడని ధర్మాసనం విచారించింది.
రాజకీయ కారణాలతోనే...
రాజకీయ కారణాలతో కోర్టును ఆశ్రయిస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విశాఖ రుషికొండపై సీఎం క్యాంప్ కార్యాలయం, అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెటనే రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో లింగమనేని శివరామ ప్రసాద్ పిటీషన్ వేశారు. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు పిటీషన్ ను తిరస్కరించింది.
Next Story