Mon Dec 23 2024 10:25:39 GMT+0000 (Coordinated Universal Time)
పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
బోగీ పట్టాలు తప్పగా.. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును ఆపి.. అధికారులకు సమాచారమిచ్చాడు.
ఏపీలో జరిగిన రైలు ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విశాఖపట్నం నుండి కిరండోల్ కు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఒక బోగి పట్టాలు తప్పింది. అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో బోగీ పట్టాలు తప్పగా.. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును ఆపి.. అధికారులకు సమాచారమిచ్చాడు. అక్కడికి చేరుకున్న సాంకేతిక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ప్రమాదాన్ని వెంటనే గ్రహించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
చలికాలం దృష్ట్యా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైళ్లలో ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓ వైపు పండుగ రద్దీ, మరోవైపు అరకులోయకు ప్రయాణికుల రద్దీ ఉన్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడంతో.. ఉన్నట్టుండి అందరూ ఆందోళనకు గురయ్యారు.
Next Story