Sun Dec 22 2024 21:03:00 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖపట్నంలో ఉచిత మద్యం.. ఎలాగంటారా?
ఫ్రీగా దొరికితే చాలు మన వాళ్లు దేన్నీ వదిలిపెట్టరు. గతంలో ఎన్నో చోట్ల
ఫ్రీగా దొరికితే చాలు మన వాళ్లు దేన్నీ వదిలిపెట్టరు. గతంలో ఎన్నో చోట్ల వాహనాల ప్రమాదాలు జరిగితే అందులో ఉన్న వాళ్లకు ఏమైందో కూడా పట్టించుకోకుండా వస్తువులను లూటీ చేస్తుంటారు. తాజాగా విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మది వద్ద మద్యం కోసం జనాలు ఎగబడ్డారు.
విశాఖ జిల్లా మధురవాడ కొమ్మది వద్ద మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో లారీలో ఉన్న లిక్కర్ బాక్సులు మొత్తం రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు మద్యం బాక్సులను చూసి వెంటనే తమ వాహనాలను ఆపారు. రోడ్డుపై పడిన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. రోడ్డుపై పడ్డ మద్యం బాటిళ్లను ఎన్ని వీలైతే అన్ని పట్టుకొని స్థానికులు వెళ్లిపోయారు. కొందరైతే పెట్టెలను కూడా ఎత్తుకెళ్తూ కనిపించారు. పోలీసులు రంగంలోకి దిగే సమయానికి రోడ్డుపై బాటిల్స్ లాంటివేవీ కనిపించకుండా చేశారు.
Next Story