మార్నింగ్ వాక్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి
ఓ యువకుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఆంద్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శుక్రవారం నాడు జరిగింది.
ఓ యువకుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఆంద్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శుక్రవారం నాడు జరిగింది. 28 ఏళ్ల యువకుడు ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో కుప్పకూలి మృతి చెందాడు. రాజాం మండలం మొగిలివలసలో శ్రీహరి ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళ్తుండగా కుప్పకూలిపోయాడు. బాటసారులు అతడిని వెంటనే రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడు ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే అతడు మృతి చెందడటం.. అతడి కుటుంబంలో విషాదాన్ని నింపింది.
ఇటీవల కాలంలో గుండె పోటు మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న ఈ తరహా ఘటనల్లో ఇది తాజాది. జిమ్‌లో పని చేస్తున్నప్పుడు, క్రీడలు ఆడుతున్నప్పుడు లేదా వారి రోజువారీ పనులకు హాజరవుతున్నప్పుడు యువకులు ఆకస్మిక గుండెపోటుకు గురయ్యే అనేక సంఘటనలు ఇటీవలి నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంఘటనలు జరిగాయి. జులై 10న తెలంగాణలోని ఖమ్మం పట్టణంలోని జిమ్‌లో వర్కవుట్ చేసిన ఓ యువకుడు హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. జూలై 8న అదే పట్టణంలో గుండెపోటుతో 33 ఏళ్ల వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే.