Mon Dec 23 2024 02:24:34 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త ఏడాది తొలి రోజునే పింఛన్లు
ఆంధ్రప్రదేశ్ అంతటా కొత్త ఏడాది తొలిరోజున లబ్దిదారులందరికీ వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
కొత్త ఏడాది తొలిరోజున లబ్దిదారులందరికీ వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు తెల్లవారు జాము నుంచే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. కొత్త ఏడాదిన ప్రభుత్వం 2,31,989 మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ను అంద చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.
పెరిగిన పెన్షన్లు...
ఈ ఏడాది పింఛను మొత్తాన్ని ప్రభుత్వం 2,750 రూపాయలకు పెంచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 64 లక్షల మందికి పింఛన్లను అందచేస్తున్నారు. వాలంటీర్లు వారి ఇంటికి వెళ్లి పింఛను మొత్తాన్ని అందచేస్తున్నారు. దీనికి సంబంధించిన నిధులను ఇప్పటికే ప్రభుత్వం గామ, వార్డు సచివాలయ శాఖల బ్యాంకు ఖాతాల్లో వేసింది. ఆదివారం సెలవు దినమైనా పంచాలన్న ఆదేశాలను వాలంటీర్లు పాటిస్తున్నారు. మున్సిపాలిటీల్లో, మండల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
Next Story