Mon Dec 23 2024 02:13:05 GMT+0000 (Coordinated Universal Time)
Volunteers : వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా... కారణం ఏం చెప్పారంటే?
నూజివీడు నియోజకవర్గంలో వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేశారు
నూజివీడు నియోజకవర్గంలో వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామాల పత్రాలను ఎండిఓ కి అందచేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తాము పనిచేశామని, అయితే ఎన్నికల నిబంధనల పేరుతో విధులకు దూరంగా పెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో ఇరుగుపొరుగు వారితో మాట్లాడిన ఫోటోలు తీసి తమను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని వారు ఆరోపించారు.
తమను దుర్భాషలాడుతూ...
జనసేన, టీడీపీ నేతలు తమ దుర్భాషలాడుతున్నారన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎంతో మందికి సేవలు చేశామని, తమనుఅనుక్షణం ఫోటోలు తీసి ఇబ్బందులకు గురిచేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రేపట్నుండి గ్రామాల్లోకి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పథకాలు ప్రజల్లో తీసుకువెళ్లి నూజివీడు ఎమ్మెల్యేని గెలిపిస్తామని చెబుతున్నారు.
Next Story