Fri Nov 22 2024 10:52:00 GMT+0000 (Coordinated Universal Time)
Andhra pradesh ఏపీలో అత్యధిక ఓటర్లున్న జిల్లా ఏదంటే?
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా విడుదయింది. తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా విడుదయింది. తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా విడుదల చేశారు. అయితే అత్యధిక ఓటర్లున్న జిల్లాగా రాయలసీమలోని కర్నూలు పేరు నమోదయింది. అలాగే అత్యల్ప ఓటర్లున్న జిల్లాగా విశాఖ ప్రాంతంలోని అల్లూరి సీతారామ జిల్లా ఉంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నామినేషన్ల చివరి తేదీ వరకూ ఓటర్ల నమోదులో మార్పులు, చేర్పులు చేపట్టే అవకాశముందని తెలిపింది. తుది జాబితాపై అభ్యంతరాల కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20, 16,396 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7,61,568 ఓటర్లున్నారు.
వెబ్ సైట్ లో అందుబాటులో...
జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్లు 4,08,07,256 ఉన్నారని తేలింది. అలాగే ముసాయిదా ఓటర్ల జాబితాతో పోలిస్తే తుదిజాబితాలో 5.86 లక్షల ఓటర్లు పెరిగారు. ఇందులో పురుష ఓటర్లు, 2,00,09,275 కాగా, మహిళ ఓటర్లు 2,07,00,375 మంది వరకూ ఉన్నారు. ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందిన తర్వాత పరిశీలించి వాటిపై విచారణ జరిపి ఏపీలో ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
Next Story