Mon Dec 23 2024 13:31:55 GMT+0000 (Coordinated Universal Time)
ఎస్మా రెడీ... ఈరోజో... రేపో?
ఏపీ లో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పీఆర్సీ పెట్టిన చిచ్చు ఇప్పట్లో చల్లబడేలా కన్పించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పీఆర్సీ పెట్టిన చిచ్చు ఇప్పట్లో చల్లబడేలా కన్పించడం లేదు. సమ్మె అనివార్యంగా కన్పిస్తుంది. ప్రభుత్వం కూడా ఉద్యోగుల డిమాండ్ కు తలొగ్గకూడదనే నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకే కొత్త జీతాల బిల్లుల ప్రాసెస్ వెంటనే చేయాలంటూ ట్రెజరీ, డీడీవో అధికారులకు మెమోలు జారీ చేసింది. బిల్లులు చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
ఆర్టీసీ కూడా....
ఉద్యోగ సంఘాలతో పాటు ఆర్టీసీ యూనియన్లు కూడా ఆందోళనకు మద్దతు పలికాయి. దీంతో ఆర్టీసీ కూడా త్వరలోనే సమ్మె నోటీసు ఇచ్చే అవకాశముండటంతో ప్రభుత్వం ఎస్మా ను ప్రయోగించేందుకు సిద్ధమవుతుందని తెలిసింది. ఈరోజు, రేపు ఎస్మాపై ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. రాష్ట్రంలో ఆరు నెలల పాటు ఎటువంటి సమ్మెలు ఉండకుండా ఎస్మా ద్వారా ప్రభుత్వం నిషేధించాలని నిర్ణయించింది. ఉద్యోగులు మాత్రం తాము ఎస్మాకు భయపడేది లేదని చెబుతున్నారు.
Next Story