Mon Dec 23 2024 07:55:52 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో పోస్టర్ల కలకలం.. ఎన్టీఆర్ పై?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటు నందమూరి కుటుంబం, టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుండగా, మంత్రులంతా టీడీపీపై విరుచుకు పడుతున్నారు. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ సవాల్ విసిరుతున్నారు. నందమూరి బాలకృష్ణ చేసిన ట్వీట్ కు ప్రతిగా పది మంది మంత్రులు ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
సోషల్ మీడియాలోనూ...
ట్వీట్లతోనే కాదు. సోషల్ మీడియాలోనూ రెండు పార్టీలూ దుమ్ము రేపుతున్నాయి. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ ఇటు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతుంది. గతంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడవటం, ఎన్టీఆర్ నాడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నాయి. తాజాగా బెజవాడలో పాత పత్రికల క్లిప్పింగ్ లు పోస్టర్లుగా దర్శనమిస్తున్నాయి. 1995లో చంద్రబాబు ఎన్టీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నాటి ఆంగ్ల పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వాటిని బెజవాడ రోడ్లపై అతికించి మరీ వైసీపీ మరొక రకమైన ప్రచారానికి దిగింది. మొత్తం మీద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కన్పిచచడం లేదు.
Next Story