Sun Dec 22 2024 12:04:30 GMT+0000 (Coordinated Universal Time)
మూడురోజులు ఎండలు మండుతాయ్
మే26, శుక్రవారం నాడు అల్లూరి సీతారామ రాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో..
ఆంధ్రప్రదేశ్ లో మూడురోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. నేడు, రేపు, ఎల్లుండి అనగా మే 26, 27, 28 తేదీల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అలాగే శుక్రవారం 84 మండలాల్లో శనివారం 130 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని తెలిపారు. నిన్న (గురువారం) అత్యధికంగా కృష్ణాజిల్లా నందివాడలో, పల్నాడు జిల్లా నర్సరావు పేటలో 44.5 డిగ్రీలు, తిరుపతి జిల్లా గూడూరులో, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 44..4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.
మూడురోజులు ఉష్ణోగ్రతలు ఇలా ఉంటాయి
మే26, శుక్రవారం నాడు అల్లూరి సీతారామ రాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 46°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే..శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C - 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొన్నారు.
మే 27 శనివారం
శనివారం రోజున పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ , గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 46°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే.. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, ప్రకాశం, SPSR నెల్లూరు, కర్నూలు, నంద్యాల, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C - 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.
మే 28 ఆదివారం
అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46°C - 48°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 45°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C-41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Next Story