Mon Dec 23 2024 01:54:51 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో నేడు వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరుగానూ, మరికొన్న చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశముందని తెలిపింది. ఉత్తర తమిళనాడు మరియు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.రాయలసీమ, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి ఎగువన 0.9 కి.మీ వరకు విస్తరించి ఉన్న మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాాతావరణ శాఖ తెలపింది.
దీని ప్రభావంతో...
దీని ప్రభావంతో రాయలసీమ, పరిసర ప్రాంతాల ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు గుండా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు విస్తరించి ఉన్న ద్రోణి.ఉత్తర కోస్తా ,రాయలసీమ లలో కొన్ని చోట్ల దక్షిణ కోస్తా లో ఒకటి లేదా రెండు చోట్లా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ఈ సందర్భంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Next Story