Tue Apr 22 2025 06:51:48 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ, తెలంగాణల్లో నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు
ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజులపా

ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందంటున్నారు. నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రాబోయే వారం రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇందులో పలు జిల్లాలకు ఐదు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు సూర్యాపేట, ఖమ్మం, ములుగు, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని అంచనా వేసింది.14,15,16వ తేదీలలో పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షసూచన జారీ చేసింది. హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Next Story