Mon Dec 23 2024 05:41:59 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert: ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన
ఆగస్ట్ 30 నుండి రాబోయే మూడు రోజులలో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో
ఆగస్ట్ 30 నుండి రాబోయే మూడు రోజులలో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులతో, భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం అంచనా వేసింది. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షంతో పాటు అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ మీదుగా గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 2న కూడా పలు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.
Next Story