వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు..
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరానికి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వారు తెలిపారు. అయితే అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకకు విస్తరించి ఉన్న ఉపరతల ఆవర్తనం కొనసాగనుందని, రెండు రోజుల్లో దక్షిణ ఝార్ఖండ్, ఒడిశా మీదుగా పశ్చిమ వాయువదిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ అల్పపీడనం కారణంగా రెండు రోజుల పాటు ఏపీలోని కొస్తా జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అలాగే పార్వతిపురం, అల్లూరి సీతామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక రాయలసీమ తెలంగాణ జిల్లాలోనూ అల్పపీడనం ప్రభావం ఉంటుందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటరర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అయతే అల్పపీడనం కారణంగా రెండు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది.