Fri Nov 15 2024 19:30:06 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో భారీ వర్షాలు.. ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే?
తెలంగాణలో భారీవర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో సోమవారం నుంచి వర్షం పడుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో
తెలంగాణలో భారీవర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో సోమవారం నుంచి వర్షం పడుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. సియర్ సూన్, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చాయని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 5 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురు, శుక్ర, శనివారాల్లోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, యాదాద్రి, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, భూపాలపల్లి, మేడ్చల్, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గురువారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Next Story