Mon Dec 23 2024 08:47:12 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఇక పెళ్లిళ్ల సందడి
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలయింది. నేటి నుంచి మేఘ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లకు వేదికలు ముస్తాబవుతున్నాయి
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలయింది. నేటి నుంచి మేఘ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లకు వేదికలు ముస్తాబవుతున్నాయి. నిన్నటి వరకూ ముహూర్తాలు లేకపోవడం, కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లు చేయడానికి వెనకంజ వేశారు. అయితే నేటి నుంచి మాఘ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల హడావిడి మొదలయింది. పురోహితుల వద్దకు వెళ్లి ముహూర్తాలను పెట్టించుకుంటున్నారు.
ఈ నెల 20వ తేదీ వరకూ....
ఈ నెల 2,3,5,6,711, 19 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ ముహూర్తాలున్నాయి. తర్వాత మూఢం వస్తుండటంతో పెళ్లిళ్లు చేయడానికి సిద్ధమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్ అయ్యాయి. వరసగా రెండు సంవత్సరాల నుంచి కరోనా ఉండటంతో పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. నేటి నుంచి బాజాబజంత్రీలు మోగుతున్నాయి.
Next Story