Thu Dec 19 2024 04:02:26 GMT+0000 (Coordinated Universal Time)
Times Now Survey : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు మాత్రం ఈ పార్టీదేనట? లేటెస్ట్ సర్వే రిజల్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ అనేక సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజా టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ అనేక సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా మరొక వైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూటములతో ఎన్నికల బరిలోకి నిలుస్తున్నాయి. దీంతో ఈసారి ఎవరిది గెలుపు అన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారన్న ఆసక్తి రెండు రాష్ట్రాల ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. జాతీయ పార్టీలు కూడా ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న చర్చ సహజంగానే జోరుగా సాగుతుంది.
రెండు పార్టీల పాలనను...
2014 నుంచి 2019 వరకూ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చూసిన ప్రజలు, 2019 నుంచి 2024 వరకూ వైసీీపీ పాలనను చూశారు. రెండు పార్టీల ప్రభుత్వాల పనితీరును బేరీజు వేసుకుని మరీ ఈసారి ఓటు వేసే అవకాశాలున్నాయి. జాతీయ పార్టీలకు ఏపీలో చోటు లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలే ఇక్కడ అధికారంలోకి రానున్నాయి. మరో వైపు కమ్యునిస్టుల ప్రభావం కూడా అంతగా ఉండని పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో గెలుపుపై ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంటుంది. అందుకే వివిధ సర్వే సంస్థలు కూడా సర్వేల మీద సర్వేలు చేస్తూ వెళుతున్నాయి.
టైమ్స్ నౌ సర్వేలో...
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది. లోక్సభ స్థానాలపై నిర్వహించిన ఈ సర్వేలో అధికార వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంటు స్తానాల్లో 19 స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేల్లో స్పష్టమయినట్లు టైమ్స్ నౌ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అన్నట్లుఈ సర్వే నిర్వహించారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేనలకు కేవలం ఆరు పార్లమెంటు స్థానాలు మాత్రమే వస్తాయని ఈ సర్వే తేల్చింది. టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో జగన్ పనితీరు పట్ల 38 శాతం ఓకే చెప్పగా, 26 శాతం మంది పరవాలేదని అన్నారు.
Next Story