AP Elections: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు..? సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
దేశం వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, ఏపీలో జరుగనున్నాయి. అయితే
దేశం వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, ఏపీలో జరుగనున్నాయి. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరింత హీట్ పెంచాయి. అయితే ఏపీలో ఎన్నికలు ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కీలక ప్రకటన చేయడంతో అసెంబ్లీ ఎన్నికల తేదీ చర్చనీయాంశంగా మారింది. 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు 2024లో సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.
ఏపీలో 175 స్థానాలు ఉండగా, అసెంబ్లీలో గంటా శ్రీనివాస్ రావు రాజీనామా ఆమోదం పొందడంతో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా, టీడీపీకి 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇక 2019 ఎన్నికల తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించడంతో ఆ సంఖ్య 19కి తగ్గింది. 2019 ఏపీలో పదిహేనవ శాసనసభను ఏర్పాటు చేయడానికి 2019 ఏప్రిల్ 11 న శాసనసభ ఎన్నికలు జరిగాయి. అవి 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగాయి.
ఎన్నికలు ఎప్పుడు..?
అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే తేదీని మాత్రం భారత ఎన్నికల సంఘం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మే లోపు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సీఎం జగన్ ఇటీవల చేసిన ప్రకటన ఆధారంగా ఎన్నికలు ఏప్రిల్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్లో ముగియనుంది. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఎన్నికలు ఏప్రిల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీకి 151, టీడీపీ 23 స్థానాల్లో గెలుపొందాయి. ఇక జనసేన పార్టీ ఒక సీటు గెలుచుకోగా, బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి రావాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అటు టీడీపీ కూడా తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తోంది.