Mon Dec 16 2024 02:40:48 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ బస్సులో ఉండగా.. అంబులెన్స్ రావడంతో?
జగన్ బస్సుయాత్ర ఎర్రగుంట్ల నుంచి నంద్యాలకు వెళుతున్న సమయంలో ఒక అంబులెన్స్ సౌండ్ వినిపించింది.
వైఎస్ జగన్ ఎక్కడ పర్యటిస్తున్నప్పటికీ ఆయన ఒక్క విషయంలో మాత్రం ఆయన అలెర్ట్ గా ఉంటారు. ఆయన పర్యటిస్తున్న సమయంలో అంబులెన్స్ వస్తే సెక్యూరిటీ వాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు. అంబులెన్స్ కు దారి ఇవ్వాలని జగన్ తొలి నుంచి చెబుతుంటారు. జగన్ 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా అంబులెన్స్ సౌండ్ వినపడితే చాలు.. ప్రసంగాన్ని ఆపి ప్రజలను దానికి దారి ఇచ్చి వెళ్లేంత వరకూ ఆయన మాట్లాడేవారు కాదు. అందుకే జగన్ పర్యటనలో సెక్యూరిటీ కూడా ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.
బస్సు యాత్రలో...
తాజాగా జగన్ బస్సుయాత్ర ఎర్రగుంట్ల నుంచి నంద్యాలకు వెళుతున్న సమయంలో ఒక అంబులెన్స్ సౌండ్ వినిపించింది. దీంతో బస్సులో ఉన్న జగన్ సెక్యూరిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తన కాన్వాయ్ ను పక్కన నిలిపేసి అంబులెన్స్ కు దారి ఇచ్చేంత వరకూ జగన్ ఉన్న బస్సు కదలలేదు. అంబులెన్స్ రావడంతో జగన్ సెక్యూరిటీ సిబ్బంది కూడా కొంత కలవరపడ్డారు. జగన్ బస్సును రోడ్డుపైనే నిలిపివేసి అంబులెన్స్ వెళ్లిన తర్వాత తిరిగి ప్రయాణమయ్యారు.
Next Story