Mon Dec 23 2024 17:15:53 GMT+0000 (Coordinated Universal Time)
White Tiger Kumari : తెల్లపులి కుమారి ఇక లేదు
2007లో హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్కు నుంచి కుమారితో పాటు మరో మగ తెల్లపులిని విశాఖ ఇందిరాగాంధీ జూపార్క్ కు..
విశాఖపట్నం జూ పార్క్ లో సందర్శకులను కనువిందు చేసే తెల్లపులి ఇక లేదు. ఇందిరాగాంధీ జూ పార్క్ లో కుమారి అనే 19 ఏళ్ల తెల్లపులి మే8 సోమవారం మరణించింది. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ పార్కులో 16 సంవత్సరాలుగా సందర్శకులను అలరించిన వైట్ టైగర్ 9 పిల్లలకు జన్మనిచ్చింది. కుమారి విశాఖ జూ లో హుషారుగా తిరుగుతూ.. పరుగెత్తుతూ, చెట్లెక్కుతూ కనువిందు చేసేది కుమారి. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న కుమారిని ఎంతో శ్రద్ధగా చూసుకునేవారు.
2007లో హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్కు నుంచి కుమారితో పాటు మరో మగ తెల్లపులిని విశాఖ ఇందిరాగాంధీ జూపార్క్ కు తీసుకొచ్చారు. ఇప్పటి వరకూ మూడుసార్లు గర్భం దాల్చిన కుమారి మొత్తం 9 కూనలకు జన్మనిచ్చింది. వృద్ధాప్యం కారణంగా కొన్ని అవయవాలు కూడా పనిచేయకపోవడంతో కుమారి మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని ఇన్ ఛార్జి క్యూరేటర్, ఏసీఎఫ్ మంగమ్మ తెలిపారు. ప్రస్తుతం జూ లో ఐదు తెల్లపులులున్నట్లు తెలిపారు.
Next Story