Mon Dec 23 2024 13:35:12 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ మూతికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా: మంత్రి రోజా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల అంశంపై మంత్రి రోజా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల అంశంపై మంత్రి రోజా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. ‘‘ముడుపుల కేసులో .... ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాడా..? లేక... బామ్మర్దిలా .... మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా ?, రామోజీలా .... మంచం ఎక్కుతాడా ?, అచ్చన్నలా .... రమేష్ ఆసుపత్రిలో చేరతాడా ?, విజయ్ మాల్యాలా..... విదేశాలకు పారిపోతాడా ?, ఇవన్నీ కాక ఎప్పటిలానే .... మరో స్టే తెచ్చుకుంటాడా ?, అని ...పలువురు గుసగుస !’’ అని రోజా ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.
ఇక చంద్రబాబును రోజా తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని రోజా ప్రశ్నించారు. పవన్ మూతికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. బీజేపీ అధ్యక్షురాలో లేక బాబు బీజేపీ అధ్యక్షురాలో తెలియడం లేదని విమర్శించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చిన విషయంపై దగ్గుబాటి పురందేశ్వరి ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు. ప్రశ్నిస్తా అంటూ చెప్పే పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. బీజేపీ అంటే ఏపీలో బాబు జనతా పార్టీగా మారిందని.. పురంధశ్వరి ఎందుకు మరిది గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సింగపూర్లో దోచుకున్న మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారన్న రోజా.. త్వరలో అమరావతి అవినీతి కేసులో చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు.
Next Story