Sun Dec 22 2024 22:12:47 GMT+0000 (Coordinated Universal Time)
ఇష్ఠం లేని ముద్దు.. భర్త నాలుక కొరికేసిన భార్య
ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటూ.. గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం (జులై21) ఉదయం కూడా వారిద్దరూ గొడవ పడ్డారు.
ఒక్కోసారి ఇష్టంలేని పనులు ప్రాణాలమీదికి తెచ్చిపెడుతుంటాయి. అందులోనూ భార్య-భర్తల విషయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. భార్యకు ఇష్టం లేకుండా ముట్టుకోడానికి లేదని మన చట్టాలు కూడా చెబుతున్నాయి. కానీ కొందరు భర్తలు మాత్రం అది తమ హక్కు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా.. భార్యకు భర్త ఇష్టం లేని ముద్దు పెట్టడంతో.. అది అతని ప్రాణం మీదికి తెచ్చింది. ముద్దు పెట్టడానికొచ్చిన భర్త నాలుకను భార్య కొరికేసింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్, కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి పుష్పవతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతా సజావుగానే ఉన్నా.. రెండేళ్లుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటూ.. గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం (జులై21) ఉదయం కూడా వారిద్దరూ గొడవ పడ్డారు. గొడవ జరుగుతుండగానే పుష్పవతి.. భర్త తారాచంద్ నాలుకను కొరికేసింది. దాంతో తారాచంద్ లబోదిబోమంటూ గుత్తి ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు తారాచంద్కు మరింత మెరుగైన చికిత్స అందించడానికి అనంతపురం ఆసుపత్రికి సిఫార్సు చేశారు. కాగా.. భర్త నాలుకను కొరకడానికి పోలీసులకు పుష్పవతి చెప్పిన కారణం విని అందరూ విస్తుపోయారు. తనపై దాడి చేసిన భర్త తారాచంద్, తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని, అందుకే ఇలా చేశానని జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, భర్త మాత్రం అందుకు భిన్నంగా చెప్పడం గమనార్హం. తన భార్యతో తనకు ముప్పు ఉందని వాపోయాడు తారాచంద్. తన పిల్లలు, తాను ఎలా బతకాలో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు.
Next Story