Thu Dec 19 2024 17:08:33 GMT+0000 (Coordinated Universal Time)
Liquor Shops Close : మూడు రోజులు మద్యం దొరకదు.. షాపులన్నీ బంద్
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులపాటు వైన్ షాపుల బంద్ కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి
ఏపీలో మూడు రోజులపాటు వైన్ షాపుల బంద్ కానున్నాయి. జూన్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుండటంతో మూడు రోజుల పాటు బంద్ చేయనున్నాయి.
మద్యాన్ని తీసుకొచ్చినా...
ఇక ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని ఏపీకి తీసుకు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది.జూన్ 4 న కౌంటింగ్ జరగనుండటంతో జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Next Story