Sat Jan 11 2025 15:34:45 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారు?
వైసీపీ అధినేత జగన్ రాసిన స్పీకర్ కు రాసిన లేఖతో ప్రతిపక్ష హోదా విషయం మరోసారి చర్చనీయాంశమైంది
వైసీపీ అధినేత జగన్ రాసిన స్పీకర్ కు రాసిన లేఖతో ప్రతిపక్ష హోదా విషయం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే అనేక మంది అనేక రకాలుగా చెబుతున్నప్పటికీ రాజ్యాంగం ఏం చెబుతుంది? చట్టంలో ఏం పొందుపర్చి ఉంది? గతంలో ప్రతిపక్ష హోదాను తక్కువ స్థానాలు వచ్చిన పార్టీకి ఇచ్చారా? అని పరిశీలిస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పదోవంతు సీట్లు ఉండాలనేది రాజ్యాగంలో ఎక్కడా చెప్పలేదు. అది అసంబద్ధమైన వాదన అని రాజకీయ నిపుణులు, సీనియర్ పాత్రికేయులు కొట్టిపారేస్తున్నారు. గతంలో లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య రాసిన ఆర్టికల్ కూడా ఇదే చెబుతుంది.
రాజ్యాంగంలో మాత్రం...
ప్రధాన ప్రతిపక్షం గురించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అదే సమయంలో పదో వంతు సీట్ల ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. రాజ్యాంగంలో అసలు ప్రతిపక్షం గురించే ప్రస్తావన లేదు. అయితే సభ్యులకు సీట్లు కేటాయించడానికి మాత్రమే ఈ వెసులుబాటును ఏర్పాటు చేసుకున్నారని ఆయన చెప్పారు. 1950 ప్రాంతంలో సభ్యులకు సీట్లు కేటాయించడానికి ఈ విధానాన్ని వినియోగించుకున్నారని తేలింది. పదోవంతకు పైన స్థానాలు వచ్చిన పార్టీలను మాత్రమే పార్టీలుగా గుర్తించి వారికి ముందు వరసలో సీట్లు కేటాయించి, మిగిలిన వారిని గ్రూపులుగా పరిగణించేవరట. తర్వాత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఈ గ్రూపుల పద్ధతిని తిరస్కరించడంతో పార్టీలుగా గుర్తించారని చెప్పారు. ఇకపదోవంతో నిబంధన అనే నిబంధనకే రాజ్యాంగంలో చోటు లేకుండా పోయింది.
స్పీకర్ నిర్ణయంపైనే...
అయితే ప్రధాన ప్రతిపక్ష నేతను గుర్తించాల్సిన బాధ్యత స్పీకర్ పైనే ఉంది. దానికి ముందుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీని గుర్తించాల్సి ఉంటుంది. అది స్పీకర్ విచక్షణ పైనే ఆధారపడి ఉంది. పార్లమెంటు కానీ, శాసనసభ కానీ సభలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఎక్కువ స్థానాలున్న పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుందని నిర్వచించారు. అంటే ఆ పార్టీకి సంబంధించిన లీడర్ ను ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాలుగు పార్టీలే ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీలు మాత్రమే ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి పొత్తు పెట్టుకుని విజయం సాధించాయి.
విపక్ష పార్టీ వైసీపీయే...
దీంతో శాసనసభలో ఉన్న ఏకైక పార్టీ వైసీపీయేనని, దానికి ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని, ఆ పార్టీ నేతనే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా స్పీకర్ నోటిఫై చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీలో ముగ్గురు సభ్యులున్న బీజేపీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అప్పుడే బీజేపీ నేతకే అపోజిషనల్ లీడర్ హోదా కూడా ఇచ్చిన సంగతిని చర్చకు పెడుతున్నారు. మరి ఏపీ స్పీకర్ కు జగన్ రాసిన లేఖలో కొంత నిజమున్నప్పటికీ అదిస్పీకర్ నిర్ణయాధికారంపై ఆధారపడి ఉందని మాత్రం చెప్పక తప్పదు.
Next Story