Ys Jagan : జగనూ.. వింటున్నావా.. చూస్తున్నావా..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అధికారం దూరమయిన ఆరు నెలల్లోనే షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అధికారం దూరమయిన ఆరు నెలల్లోనే షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ప్రధానంగా ఒక సామాజికవర్గం ఆయనకు దూరంగా వెళ్లిపోతుంది. తాజాగా ఈరోజు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరో కీలక నేత గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామాకు రెడీ అయిపోయారు. అసలు వైసీపీలో ఏం జరుగుుతుంది. ఎక్కడ లోపం ఉంది? ప్రధానంగా కాపు సామాజికవర్గం నేతలు ఫ్యాన్ పార్టీకి దూరమవుతున్నట్లే కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో భవిష్యత్ లేదని భావించిన కాపు సామాజికవర్గం నేతలు తమకు అధికారంలో ఉన్న ప్పుడు మంత్రి పదవులు కట్టబెట్టినా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. వారు రాజీనామా చేయడానికి గల కారణాలు కొత్తవి కాకపోయినప్పటికీ ఒకే సామాజికవర్గం దూరం కావడం జగన్ ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటి వరకూ అనేక మంది నేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. వారిలో కాపు సామాజిక వర్గం నేతలే ఎక్కువగా ఉండటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.