Tue Apr 15 2025 11:36:54 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ గురించి యార్లగడ్డ అంత మాట అనేశారేంటి?
వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటముల బాధ్యత జగన్ దేనని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటముల బాధ్యత జగన్ దేనని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థులను మార్చడం అనేది సాధారణ విషయమేనని అన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసునని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. దాని గురించి ప్రత్యేకంగా తాను చెప్పాల్సిన పనిలేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఏం జరగబోతుందో అందరికీ తెలుసునని అన్నారు.
జూనియర్ గురించి...
ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆయన మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశం ఎత్తుకు ఎదిగారన్నారు. తారక్ ను తగ్గించాలని చూస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని కూడా అన్నారు. తారక్ ఎదుగుదలలో బాలకృష్ణ ప్రమేయం ఏమీ లేదన్న యార్లగడ్డ ఆయన ఎదుగుదలకు జూనియర్ ఎన్టీఆర్ తల్లి ప్రధాన కారణమని చెప్పారు.
Next Story