Sun Nov 24 2024 08:26:49 GMT+0000 (Coordinated Universal Time)
ఏ1 గా యార్లగడ్డ వెంకట్రావు
నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం
నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇరు వర్గాలు దాడులు చేసుకునేంత వరకు వెళ్లాయి. ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ కేసుల్లో 50 మందికి పైగా నిందితులుగా పేర్కొన్నారు. వైసీపీకి రాజీనామా చేసి ఇటీవలే టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావును ఈ కేసులో ఏ1గా పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పార్టీ ఇంచార్జిగా ఇటీవలే యార్లగడ్డ వెంకట్రావును అధికారికంగా ప్రకటించారు నారా లోకేష్. గన్నవరంలో 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ గెలిచారు. వైసీపీ హవా ఉన్న సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ గన్నవరం సీటును మాత్రం దక్కించుకుంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీ చెంత చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి బాగాలేదు. ఇక ఇటీవల వైసీపీని వీడిన యార్లగడ్డ వెంకట్రావు రెండు రోజుల క్రితమే లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. యార్లగడ్డతో వైసీపీలో ఉన్న నేతలు, అనుచరులు కూడా టీడీపీలో చేరారు. ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తల ముందే యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జిగా ప్రకటించారు లోకేష్.
Next Story