Sat Jan 11 2025 10:40:36 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో రచ్చ.. రచ్చ.. టీడీపీ నేతలపై?
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఢిల్లీలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఢిల్లీలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. టీడీపీ ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ లపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మండి పడ్డారు. తాను అనని మాటలను అన్నట్లు వక్రీకరించారని ఫైర్ అయ్యారు. వీడియో క్లిప్పింగ్ లను కట్ చేసి వారు తనపై దుష్ప్రచారానికి దిగారని మార్గాని భరత్ ఆరోపించారు.
అనని మాటలను....
తాను నిన్న ఎఫ్ఆర్ఎంబీ పై సభలో మాట్లాడితే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ఏపీ ప్రభుత్వానికి కష్టంగా ఉందని తాను చెపపినట్లు సృష్టించారన్నారు. తాను మాట్లాడిన వీడియోలో మరికొన్నింటిని మిక్స్ చేశారని భరత్ ఆరోపించారు. తన తండ్రి వయసున్న కనకమేడల రవీంద్ర కుమార్ తనను బద్నాం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఏపీ పరువు, ప్రతిష్టలను ఢిల్లీలో టీడీపీ నేతలు బజారు కీడుస్తున్నారన్నారు.
Next Story