Fri Nov 22 2024 22:18:32 GMT+0000 (Coordinated Universal Time)
Mudragada Padmanabham : వైసీపీలో నేను ఎందుకు చేరానంటే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కిర్లంపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, పోలవరం ప్రాజెక్టులపై తనకు స్పష్టమైన హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధమని ఆ పార్టీ నేతలతో చెప్పానని అన్నారు. అయితే ఆ విషయాల్లో వారి నుంచి ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. అందుకే తాను వైసీపీలో చేరానని ముద్రగడ పద్మనాభం తెలిపారు. జగన్ ఆలోచనలు బాగుండబట్టే తాను వైసీపీలో చేరానని చెప్పారు.
అందుకే చంద్రబాబుకు కోపం...
మరో ముప్పయి ఏళ్లు జగన్ అధికారంలో ఉండటం ఖాయమని తెలిపారు. తాను ఇకపై కాపు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి ఉద్యమాలు చేయబోనని కూడా అన్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమన్న ముద్రగడ పద్మనాభం, ఎన్నికలు సినిమా కాదని, ఆవేశంతో మాట్లాడినంత మాత్రాన జనం ఓట్లు వేయరని అన్నారు. రాజకీయాల్లో పవన్ కంటే చిరంజీవి చాలా బెటర్ అని ముద్రగడ అన్నారు. పవన్ జెలుకెళ్లి చంద్రబాబును కలిశాకే ఆయన గ్రాఫ్ పెరిగిందని తాను అన్నందుకు తనపై కోపం పెంచుకున్నారని ముద్రగడ అన్నారు.
Next Story