Mon Dec 23 2024 07:10:16 GMT+0000 (Coordinated Universal Time)
దేవినేని అవినాష్ కే టిక్కెట్
విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతున్నారు. తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును ప్రకటించారు. ఆయనను గెలిపించుకుని రావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. నిన్న విజయవాడ తూర్పు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలతో జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దేవినేని అవినాష్ ను అభ్యర్థిగా ప్రకటించారు.
భవకుమార్ కు హామీ...
వచ్చే ఎన్నికల్లో దేవినేని అవినాష్ ను గెలిపించాలని, అవినాష్ ను మీకు అప్పగిస్తున్నానని జగన్ ప్రకటించారు. అందరూ కలసి జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. అక్కడే ఉన్న తూర్పు నియోజకవర్గం నేత భవకుమార్ ను మాత్రం ఒకటి రెండు రోజుల్లో వచ్చి తనను కలవాలని చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఖరారయినట్లే.
Next Story