Thu Dec 19 2024 18:52:47 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలంటే వైసీపీకే ఓటేయండి
వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలంటే వైసీపీకి ఓటు వేయాలని వైసీపీ చీఫ్ జగన్ పిలుపు నిచ్చారు
వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలంటే వైసీపీకి ఓటు వేయాలని వైసీపీ చీఫ్ జగన్ పిలుపు నిచ్చారు. గుంటూరు జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఒక్క ఇంటికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే ఫ్యాన్ పార్టీ గుర్తు కే ఓటు వేయాలని అన్నారు. ఒకే గుర్తుపై రెండు ఓట్లు వేయాలని, రెండుసార్లు బటన్ నొక్కాలని జగన్ పిలుపు నిచ్చారు. మళ్లీ సంక్షేమ పధకాలు అమలు కావాలంటే వైసీపీనే ఆదరించాలని వైఎస్ జగన్ కోరారు. చంద్రబాబు మాటలను నమ్మవద్దని కోరారు.
బాబు మోసకారి...
చంద్రబాబు మోసకారి అని, గతంలో మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని అన్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఆయన వదినమ్మ కలసి జనంలోకి వచ్చి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. రంగుల రంగుల మ్యానిఫేస్టోను పంచి ఓట్లను దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ వలలో ఎవరూ పడవద్దని జగన్ కోరారు. ప్రజలు రెండుసార్లు బటన్ నొక్కి వైసీపీని గెలిపించారన్నారు.
Next Story