Ys Jagan : జగన్ కు ఐదేళ్లు అంత ఈజీ కాదు.. నేతలను కాపాడుకోవడం కష్టమేనట
వైసీపీ అధినేత జగన్ కు రానున్న కాలం గడ్డుకాలమే. ఒకవైపు కేసులు.. మరొక వైపు పార్టీని వీడనున్న నేతలు
వైసీపీ అధినేతకు రానున్న కాలం గడ్డుకాలమే. ఒకవైపు కేసులు.. మరొక వైపు పార్టీని వీడనున్న నేతలు. వీటన్నింటిని తట్టుకుని ఐదేళ్ల పాటు పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. అది అంత సులువైన టాస్క్ కాదు. ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయనేతలు అధికారం ఎటు వైపు ఉంటే అటువైపే మొగ్గు చూపుతారు. ఎవరో తక్కువ శాతం మంది తమకు మరొక దారి లేక ప్రతిపక్షంలో ఉండే పార్టీలో కొనసాగాల్సిందే తప్ప మిగిలిన వారికి ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండటాన్ని భరించలేరు. అధికార పార్టీలో ఉంటే మర్యాదకు మర్యాద.. గౌరవానికి గౌరవం. అంతే.. ఇప్పుడు రాజకీయాలన్నీ అలాగే ఉన్నాయి. అందుకే జగన్ పార్టీ నేతలను కాపాడుకోవడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. తాను ఎంత ధైర్యాన్ని నూరిపోసినా జారిపోయే వాళ్లు ఆగరు. వెళ్లిపోయేవారిని ఆపలేని పరిస్థితుల్లో జగన్ ప్రస్తుతం ఉన్నారు. పదకొండు స్థానాలే రావడం భవిష్యత్ లో ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు వంటివి దక్కకపోవడం ఈ పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు.